ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. అందులో సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్‌ నర్సు, ఇద్దరు అటెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. గవర్నర్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్‌ వచ్చిందన్నారు.  ఈ నలుగురికి తప్ప..రాజ్‌భవన్‌లో ఎవరికీ కరోనా సోకలేదని  చెప్పారు. 


'గవర్నర్‌తో సహా అందరికీ టెస్టులు నిర్వహించాం.  ఏపీలో 31 మంది వైద్య సిబ్బందికి  కరోనా సోకింది. పాజిటివ్‌గా తేలినవారిలో 12 మంది డాక్టర్లు, 12 మంది నర్సులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో అందరికీ పరీక్షలు చేస్తున్నామని' వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.