విమానంలో పావురం.. పట్టుకునేందుకు ప్రయాణికుల ప్రయత్నం


విమానంలోకి పావురం ప్రవేశించడంతో.. ప్రయాణికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పావురాన్ని ప్రయాణికులు వింతగా చూస్తూ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నిన్న సాయంత్రం గోఎయిర్‌ విమానం అహ్మదాబాద్‌ నుంచి జైపూర్‌కు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో లోపల పావురం కనిపించింది. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. పావురాన్ని పట్టుకునేందుకు ప్రయాణికులు ప్రయత్నించారు. పావురం ఏమో విమానంలోనే అటు ఇటు ఎగురుతుంది. చేసేదేమీ లేక విమానం తలుపులు తెరియడంతో.. ఆ పావురం గాల్లోకి ఎగిరిపోయింది. అనంతరం విమానం అహ్మదాబాద్‌ నుంచి జైపూర్‌కు బయల్దేరింది. పావురం అంతరాయం కలిగించడంతో 30 నిమిషాలు ఆలస్యమైంది. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో సాయంత్రం 6:15 గంటలకు ల్యాండ్‌ కావాల్సిన విమానం 6 :45 గంటలకు ల్యాండ్‌ అయింది. విమానాల్లోకి పక్షులు ప్రవేశించడం సాధారణమైంది. చిన్న పక్షులు కాకుండా పెద్ద పక్షులు విమానాల్లోకి ప్రవేశించి.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి.