భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు ఆన్‌లైన్‌లో మార్చి 1వ తేదీ ఆదివారం నుంచి టిక్కెట్ విక్రయాలు ప్రారంభించనున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. టిక్కెట్లను www.bhadrachalamonline.com వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నామన్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో కల్యాణపు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. భధ్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. 2వ తేదీన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 3న స్వామివారి మహాపట్టాభిషేకం వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
శ్రీరామనవమికి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు